చిన్నారుల వ్యాక్సిన్‌పై నిర్లక్ష్యం వద్దు
బిజినేపల్లి: చిన్నారులకు అందించే వ్యాధి నిరోధక టీకాల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని.. నిర్ణీత దశల్లో తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని డీఎంహెచ్‌ఓ డా.స్వరాజ్యలక్ష్మి అన్నారు. బుధవారం బిజినేపల్లి, పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. చిన్నారుల వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు యూవిన్ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలను పెంచాలని, ప్రతి గర్భిణికి ప్రసవ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎంహెచ్‌ఓ వెంట వైద్యాధికారి శివకుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment