ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయండి
నాగర్‌కర్నూల్ క్రైం: విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా షీటీం ఇన్‌చార్జ్ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మండలంలోని వనపట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో షీటీంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షీటీంను సంప్రదించి ఫిర్యాదు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆకతాయిల ఆట కట్టించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రత్యేకంగా ప్రధాన కూడలిలో, చౌరస్తాలో, జిల్లా కేంద్రాల్లో షీటీం పనిచేస్తుందని, బాధితులు డయల్ 100, సెల్ నం.87126 57676కు ఫోన్ చేసి వివరాలు చెప్పాలని కోరారు. సమాజంలో మహిళలు, బాలికలు తెలిసిన వారితోనే ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారని, జాగ్రత్తగా ఉండాలే తప్ప అధైర్యపడొద్దన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రమోహన్, షీటీం మెంబర్ వెంకటయ్య, భరోసా టీం శ్రీవిద్య, జ్యోతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment