యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: మత్తుకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి ఎస్పీ తయారు చేయించిన వీడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల నుంచి మన దేశ భవిష్యత్‌ను కాపాడే యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిసైతే కలిగే నష్టాల గురించి గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, సింగర్ మీసాల రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment