ఉపాధ్యాయులకు చెబితే..
మేం రోజు మాదిరిగానే పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేశాం. అయితే ఒంటిగంటకు భోజనం చేసి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నాం. కొంత సమయానికి కడుపు నొప్పి మొదలైంది. ఈ విషయం మొదట ఉపాధ్యాయులకు చెబితే లైట్‌గా తీసుకుని..పట్టించుకోలేదు.
– మహేష్, 7వ తరగతి
నాణ్యతగా ఉండదు..
మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడం వల్లనే అనారోగ్యానికి గురయ్యాం. ప్రతిరోజు కూడా మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించడం లేదు. ఈ విషయమై ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా వంట ఏజెన్సీని మార్చి నాణ్యమైన భోజనం అందించాలి.
– జగదీశ్, 7వ తరగతి
వెంటనే స్పందించాం..
విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఉపాధ్యాయులు సమాచారం అందించడంతో వెంటనే స్పందించి చికిత్స అందేలా చూశాం. అయితే విద్యార్థులు అస్వస్థతకు గురవడానికి కారణం మధ్యాహ్న భోజనమా అనేది ఇంకా తేలలేదు. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– మురళీధర్‌రెడ్డి, హెచ్‌ఎం
●
Comments
Please login to add a commentAdd a comment