నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా
అచ్చంపేట రూరల్: రైతులు, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. బుధవారం అచ్చంపేటలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్‌స్టేషన్లు, ఫీడర్ చానళ్లను డీఈ, ఏఈలు తరుచూ పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయం, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం విద్యుత్ శాఖలోని అభివృద్ధి పనులు, నూతనంగా మంజూరైన సబ్‌స్టేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు, స్థల సేకరణ త్వరగా పూర్తిచేయాలన్నారు. విద్యుత్ సమస్యలేకున్నా.. ఉన్నట్లు సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. అంతకు ముందు విద్యుత్‌శాఖ అధికారులు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీఈ శ్రీధర్‌శెట్టి, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు ఆంజనేయులు, రమేష్, అప్పలనాయుడు, సుధాకర్‌రావు, కొండల్, మేఘనాథ్, జానకీరాం, లైన్‌మేన్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment