నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమ లు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక బాల్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్‌రెడ్డి మాట్లాడుతూ సంయుక్త కిసాన్ మోర్చ, ట్రేడ్ యూనియన్, వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామ ని పిలుపునిచ్చారు. ఈ నెల 25న జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, 26న జిల్లాకేంద్రంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలకు రైతుభరోసా, పంటలకు బోనస్ ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసులు, లక్ష్మణ్, నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment