వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

Published Sun, Jan 5 2025 1:44 AM | Last Updated on Sun, Jan 5 2025 1:44 AM

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు

తాడూరు: విద్యార్థినులు, మహిళలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్‌ ఎస్పీ సీహెచ్‌ రామేశ్వర్‌ హెచ్చరించారు. శనివారం మండలంలోని ఇంద్రకల్‌ ఉన్నత పాఠశాలలో షీ టీం, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు, బాలికల రక్షణ కోసమే షీ టీంలు పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు, బాలికలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా ధైర్యంగా డయల్‌ 100 లేదా 87126 57676 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇటీవల ఇన్‌స్ట్రాగామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడంతో పాటు ఆకర్షణకు గురై మోసపోతున్నారని తెలిపారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండి చదువుపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. అనంతరం భరోసా కేంద్రం సేవలు, పోక్సో చట్టం గురించి కేంద్రం కోఆర్డినేటర్‌ వివరించారు. కార్యక్రమంలో షీ టీం జిల్లా ఇన్‌చార్జి విజయలక్ష్మి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement