ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజులపాటు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రోడ్డు నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment