వారం రోజుల్లో మార్కండేయ లిఫ్ట్ ప్రారంభం
బిజినేపల్లి: మండలంలోని శాయిన్‌పల్లిలో నిర్మించిన మార్కండేయ ఎత్తిపోతల పథకాన్ని వారం రోజుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి చెప్పారు. బుధవారం మార్కండేయ ఎత్తిపోతల పంపుహౌజ్‌లో మోటారు ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. అనంతరం బిజినేపల్లిలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కండేయ ఎత్తిపోతల కింద 7,300 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందన్నారు. ఎత్తిపోతల నిర్మాణానికి రూ. 77.61 కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట ఎస్‌ఈ సత్యనారాయణరెడ్డి ఉన్నారు. కాగా, మార్కండేయ లిఫ్ట్ ట్రయల్ రన్‌ను పరిశీలించి.. తిమ్మాజిపేటకు వెళ్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి, బీజేపీ నాయకులను స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment