అచ్చంపేట రూరల్: గాంధీస్మారక నిధి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘బాపుబాటలో సత్యశోధన’ పాదయాత్ర ముగింపు కార్యక్రమం ఈనెల 11న అచ్చంపేటలో నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ ప్రొఫెసర్, గాంధీ స్మారక నిధి మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ డాక్టర్ శివార్చక విజయ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్‌గాంధీ రానున్నారని, అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీ డాక్టర్ మల్లు రవి కూడా హాజరు అవుతారని తెలిపారు. గాంధేయ వాదులు, యువత, విద్యార్థులు, ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై యాత్ర ముగింపును విజయవంతం చేయాలని ఆయన కోరారు.
● అచ్చంటపేటకు తుషార్‌గాంధీ రాక
Comments
Please login to add a commentAdd a comment