‘యాంత్రీకరణ’.. పునరుద్ధరణ!
ఎగ్జిబిషన్లు నిర్వహించి..
వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, యంత్రాలకు సంబంధించి ఆయా తయారీదారుల చేత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించాలన్ని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. ఇటీవల అన్ని జిల్లాలకు చెందిన అధికారులతో రాష్ట్ర స్థాయిలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాంత్రీకరణ పథకం పునరుద్ధరణపై చర్చించారు. ఎగ్జిబిషన్లు పూర్తయ్యాక పథకం అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
నల్లగొండ అగ్రికల్చర్: ఆరేళ్ల క్రితం నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తామని ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. దీంతో రైతుల్లో యంత్ర సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో ఈ పథకం అమలైనప్పుడు జిల్లాలో ప్రతి సీజన్‌లో అర్హతలను బట్టి సుమారు 3 వేల నుంచి 4 వేల మంది రైతులు లబ్ధి పొందినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
2018లో నిలిచిన పథకం
2014వ సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ యాత్రీకరణ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రైతులకు 50 శాతం సబ్సిడీపై యాంత్రీకరణ పరికరాలైన ట్రాక్టర్లు, టిల్లర్లు, స్ప్రేయర్లు, టార్పాలిన్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, నాగళ్లు, హార్వెస్టర్లు తదితర వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించింది. నాలుగేళ్ల పాటు సాఫీగా సాగిన ఈ పథకం 2018 సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టడంతో నిలిపివేసింది. దీంతో పాటుగా రైతులకు ఇచ్చే సబ్సిడీ విత్తనాలను కూడా నిలిపివేసింది. రైతుబంధు, రైతుబీమా పథకాలు తప్ప రైతులకు ఏ ఇతర సబ్సిడీ పథకాలను అమలు చేయలేదు. దీంతో రైతులకు సబ్సిడీ పథకాలు అందక నానా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమలు చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సమాచార సేకరణలో ప్రభుత్వం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని తిరిగి అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి జిల్లాల నుంచి పూర్తిస్థాయి నివేదికలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఏయే జిల్లాలో రైతులు ఎలాంటి పరికరాలు వినియోగిస్తున్నారు.. ఏయే కంపెనీలకు చెందిన ట్రాక్టర్లు, టిల్లర్లు, హార్వెస్టర్లపై ఆసక్తిని చూపుతున్నారనే సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది.
ఫ ఆరేళ్ల క్రితం నిలిచిన
వ్యవసాయ యాంత్రీకరణ పథకం
ఫ అప్పటినుంచి రైతులకు అందని సబ్సిడీ పరికరాలు
ఫ పథకాన్ని మళ్లీ అమలుచేసే
యోచనలో ప్రభుత్వం
ఫ సమాచారం సేకరిస్తున్న యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment