నేడు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించనున్నారు. మధ్యాహ్నం తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొని 4 గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
29న వాహనాల వేలం
దేవరకొండ : దేవరకొండ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను ఈనెల 29న వేలం వేయనున్నట్లు దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంపాటలో పాల్గొనాలనుకునే వారు ద్విచక్ర వాహనాలకు రూ.10వేలు, ఫోర్ వీలర్స్‌కు రూ.30వేలు డిపాజిట్ చేసి 29వ తేదీ 10గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వేలంపాటలో ఎలాంటి వాహనాన్ని కొనుగోలు చేయని పక్షంలో డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
మహబూబ్‌నగర్ సదస్సుకు జిల్లా రైతులు
నల్లగొండ అగ్రికల్చర్ : సంక్షేమ పథకాలు, సాగులో యంత్రాల వినియోగంపై ఈ నెల 28, 29, 30 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించే సదస్సుకు జిల్లా రైతులను పంపిస్తున్నట్లు జిల్లా వ్యవసాయధికారి పాల్వాయి శ్రవణ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 29న జిల్లా నుంచి 13 మండలాలకు చెందిన 900ల మంది రైతులను బస్సుల ద్వారా సదస్సుకు తరలిస్తామన్నారు. 30న జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులను తరలిస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ జట్టుకు ఎంపిక
నకిరేకల్ : కట్టంగూరు మండలం చెర్వు అన్నారం గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో మంగళవారం ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ జూనియర్స్ బాలికల విభాగంలో నకిరేకల్ ఏవీఎం హైస్కూల్ విద్యార్థిని ఎన్.లిఖిత ఉత్తమ ప్రతిభ కనబర్చి ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికయింది. ఈ నెల 29 నుంచి 31 వరకు నిజామాబాద్ జిల్లాలో జరగబోయే 53వ జూనియర్ బాలికల తెలంగాణ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ చాంపియన్ షిప్‌ల్లో లిఖిత పాల్గొననుంది. బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో లిఖితను ఏవీఎం విద్యాసంస్థల అధినేత కందాల పాపిరెడ్డి, అడ్మినిస్ట్రేటర్ కందాల శ్రీకాంత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి ప్రిన్సిపాల్ కందాల స్వప్నారెడ్డి, నిమ్మల శంకర్‌గౌడ్ అభినందించారు.
విద్యా వ్యవస్థపై ప్రభుత్వం దృష్టి సారించాలి
దేవరకొండ: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టిసారించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేశ్ అన్నారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కళాశాలల్లో సభ్యత్వ నమోదు చేపట్టి నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగు చూస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాంఖిడి ఘటనలో విద్యార్థిని చనిపోయినా ప్రభుత్వం ఎ లాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నా రు. తక్షణమే రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్, చరణ్, రాజేష్, అంజి, విక్రమ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment