నాణ్యమైన భోజనం అందించాలి
కట్టంగూర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలను పరిశీలించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకొని మాట్లాడారు. వంట పాత్రలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఎస్‌ఓ నీలాంబరికి సూచించారు. ఆయన వెంట డీఈఓ భిక్షపతి తదితరులు ఉన్నారు.
డేటా ఎంట్రీ వేగవంతం చేయాలి
కుటుంబ సమగ్ర సర్వే డేటా ఎంట్రీని వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం కట్టంగూర్ తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలో చేపట్టిన డేటా ఎంట్రీని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఆన్‌లైన్ డేటాను గోప్యంగా ఉంచాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ గుగులోతు ప్రసాద్, ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, డీటీ సుకన్య, ఎంపీఓ చింతమల్ల చలపతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment