రూ.386.24 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
నల్లగొండ : ధాన్యం సేకరణలో భాగంగా వానాకాలంలో జిల్లాలో ఇప్పటివరకు 27,936 మంది రైతుల నుంచి రూ.386.24 కోట్ల విలువ వైన 1,66,485 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. జిల్లాలో 346 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ధాన్యం అమ్మిన వారిలో 22,515 మంది రైతులకు రూ.318.54 కోట్లు చెల్లించామని తెలిపారు. సన్నధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 1,547 మంది రైతుల నుంచి 8,001 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని.. వారిలో 512 మంది రైతులకు రూ.7 కోట్లు చెల్లించామని వివరించారు. సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్‌ను కోటీ 51 లక్షల రూపాయలను రైతులకు జమచేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment