ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
మునుగోడు : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. బుధవారం ఆమె మునుగోడు మండలంలోని జమస్థాన్‌పల్లి కొనుగోలు కేంద్రాన్ని, నర్సరీని పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని జ్యోతీరావుపూలే బాలికల గురుకుల పాఠశాలతో పాటు సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి.. వెంటనే తూకం వేసి పంపాలన్నారు. గ్రామాల్లో నిర్ధేశించినా ప్రకారం నర్సరీల్లో మొక్కలను పెంచాలని సూచించారు. సూపర్‌వైజర్లు దగ్గరుండి సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ చేయించాలన్నారు. ఆమె వెంట డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ మురళి, ఏపీడీ నవీన్, తహసీల్దార్ ఎం.నరేందర్, ఎంపీడీఓ విజయభాస్కర్, ఏడీఏ వేణుగోపాల్, ఏఓ పద్మజ, మండల పంచాయతీ అధికారి స్వరూపారాణి తదితరులు ఉన్నారు.
ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు..
గురుకుల పాఠశాల సందర్శనలో భాగంగా ఆ పాఠశాల పరిసరాలతో పాటు వంటగదని కలెక్టర్ పరిశీలించారు. ఆ సమయంలో గ్యాస్ లీకయి వాసన రావడంతో పాటు గది అంతా అపరిశుభ్రంగా ఉండటంతో ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంటచేసే గది అపరిశుభ్రంగా ఉంటే భోజనం ఎలా నాణ్యంగా ఉంటుందని ప్రశ్నించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌కి షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో పాఠశాల వంట గదిని తహసీల్దార్ పరిశీలించి పరిశుభ్రంగా ఉందో లేదో తనకు నివేదిక పంపాలని ఆదేశించారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
పాఠాలు బోధించిన కలెక్టర్..
మునుగోడు మహాత్మా జ్యోతీరావు పూలే గురుకుల పాఠశాల తనిఖీకి వచ్చిన కలెక్టర్ ఆ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించారు. పాఠం విద్యార్థులకు అర్థమైందా.. లేదా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment