సీసీఐ కేంద్రాల్లో వ్యాపారుల పత్తి కొనొద్దు
మునుగోడు : సీసీఐ కొనుగోళ్లు కేంద్రాల్లో రైతుల పత్తి మాత్రమే కొనుగోళ్లు చేయాలని, వ్యాపారులు తీసుకొచ్చిన పత్తిని కొనుగోలు చేయొద్దని మార్కెటింగ్ శాఖ జేడీ ఉప్పల శ్రీనివాస్ సూచించారు. బుధవారం ఆయన మునుగోడు మండలంలోని మూడు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లను తనఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందించేందుకు సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది పంట దిగుబడి వచ్చాక వర్షాలు కురవడంతో పత్తిలో తేమశాతం పెరిగిందని.. 12 కంటే అధికంగా తేమశాతం ఉన్నప్పటికీ రైతుల పత్తిని కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఉప సంచాలకులు వి.పద్మావతి, మార్కెట్ ఏడీ ఛాయాదేవి, చండూరు మార్కెట్ కార్యదర్శి కత్తుల రవి, సీసీఐ కొనుగోళ్లు కేంద్రం నీమ్‌జే ఉన్నారు.
ఫ మార్కెటింగ్ శాఖ జేడీ ఉప్పల శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment