హుజూర్‌నగర్ : ధనుర్మాస వ్రతం ఎంతో పవిత్రమైందని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు పరిశీలకుడు వింజమూరి విజయ్ కుమార్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని జ్ఞాన సరస్వతి దేవాలయంలో నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని తాను ఆచరించడమే కాకుండా స్త్రీలు కూడా ఆచరించేటట్లు చేసిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment