గర్భిణుల్లో ఫ్లోరోసిస్ లక్షణాలు
మర్రిగూడ మండలంలో కొనసాగుతున్న సర్వేలో పలువురు గర్భిణుల్లో ఫ్లోరోసిస్ లక్షణాలు ఉన్నట్లు తేలింది.
- 8లో
వెల్లుల్లి కిలో రూ.450
నల్లగొండ టౌన్: వెల్లుల్లి ధర ఆకాశాన్నంటింది. పక్షం రోజుల క్రితం రూ.350 ఉండగా ఉన్న ధర అదనంగా రూ.100 పెరిగింది. ప్రస్తుతం రూ.450 ధర పలుకుతోంది. పంట స్థానికంగా పండించక పోవడమే దీనికి ప్రధాన కారణం. దీని కోసం ఇతర రాష్ట్రంపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి: వెల్లుల్లిని మధ్యప్రదేశ్ నుంచి టోకు వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ఆ రాష్ట్రం నుంచి నేరుగా లారీల ద్వారా సరుకు రవాణా అవుతుంది. కొన్నిసార్లు హైదరాబాద్‌లోని ప్రధాన మార్కెట్ల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు.
కొత్త సరుకు వస్తేనే: గత ఏడాది కిలో వెల్లుల్లి రూ.200 నుంచి రూ.300 ఉండేది. ప్రస్తుతం రూ.450 పలుకుతోంది. దీంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడు తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌నుంచి పాత సరుకే వస్తోంది. కొత్త సరుకు వచ్చే వరకు ధర తగ్గే అవకాశం లేదని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment