యాదగిరిగుట్ట ప్రసాదానికి విజయ నెయ్యి!
గుట్టను మినహాయించాలి
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు మార్చి 1నుంచి విజయ డైయిరీ నెయ్యి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రతి నెలా 30 టన్నుల నెయ్యి మదర్ డైయిరీ సరఫరా చేస్తుంది. ఇది డెయిరీకి అతిపెద్ద ఆదాయ వనరు. గుట్టకు మదర్ డెయిరీ నెయ్యినే సరఫరా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. –గుడిపాటి మధుసూదన్‌రెడ్డి,
మదర్‌డెయిరీ చైర్మన్
సాక్షి, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి జనవరి 1నుంచి విజయ డెయిరీ నెయ్యి సరఫరా కానుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో యాదగిరిగుట్ట క్షేత్రానికి మదర్ డెయిరీతో 35 ఏళ్లుగా ఉన్న అనుబంధం తెగిపోనుంది. దీంతో పాటు నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు క్షేత్రానికి సైతం విజయ డెయిరీ నుంచే నెయ్యి సరఫరా జరగనుంది.
కోల్పోనున్న ఆదాయం ఇలా..
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మదర్ డైయిరీ ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం కోల్పోనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, చెర్వుగట్టుతో పాటు రాష్ట్రంలోని కీసర, వేములకొండ తదితర ఆలయాలకు కొన్నేళ్లు మదర్ డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.36 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో ఒక్క యాదగిరిగుట్ట ఆలయానికే నెలకు 30 టన్నుల నెయ్యిని మదర్ డెయిరీనుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు గాను దేవస్థానం ఏటా రూ.18 కోట్ల వరకు చెల్లిస్తుంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న మదర్ డైయిరీ.. ప్రభుత్వ నిర్ణయంతో మరింత చతికిలపడే పరిస్థితి నెలకొంది.
అత్యధిక రైతులు యాదాద్రి జిల్లాలోనే..
ఉమ్మడి నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నార్ముల్ మదర్ డైయిరీలో అత్యధికంగా యాదాద్రి జిల్లాకు చెందిన రైతులే ఉన్నారు. జిల్లాలో 24 చిల్లింగ్ సెంటర్లు ఉండగా, 435 సొసైటీల ద్వారా సుమారు 45 వేల మంది రైతులు రోజూ సగటున లక్ష లీటర్ల పాలు పోస్తున్నారు. ఇందులో అధికంగా భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల పరిధిలోని 30 వేల మంది రైతులు 12 చిల్లింగ్ సెంటర్లలో 60 వేల లీటర్ల పాలు పోసి ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ గడిచిన 40 ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రైవేట్ డైయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చినా రైతులు మదర్ డైయిరీని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంలో యాదగిరిగుట్ట, చెరువుగుట్టు దేవాలయాలను మినహాయించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే వేలాది మంది రైతులకు అండగా ఉన్న మదర్ డైయిరీ మరింత నష్టాలబారిన పడే అవకాశం ఉంది.
జనవరి 1నుంచి సరఫరా
ఫ ప్రభుత్వ ఆదేశాల అమలుకు సన్నాహాలు
ఫ మదర్ డెయిరీతో తెగిపోనున్న 35 ఏళ్ల అనుబంధం
ఫ ఏటా రూ.18కోట్ల ఆదాయం కోల్పోనున్న సంస్థ.. ఇప్పటికే నష్టాల ఊబిలో..
ఫ గుట్టకు మినహాయించాలని సీఎంకు వేడుకోలు
Comments
Please login to add a commentAdd a comment