ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి
నల్లగొండ: ప్రభుత్వ రంగాన్ని కాపాడాలంటే ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, అప్పుడే అన్నివర్గాలకు సమాన విద్య అందుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నల్లగొండలో కొనసాగుతున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర 6వ మహాసభల సందర్భంగా రెండో రోజైన ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన విద్య విధానం అమలైతే విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళుతుందన్నారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 15 శాతం నిధులు, కేంద్ర ప్రభుత్వం ఆరు శాతం నిధులు కేటాయిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేయాలని, ఒకవేళ న్యాయపర చిక్కులుంటే సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేసే వారికి కనీస వేతనం అమలు చేయాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యాక్షులు సీహెచ్.రాములు, రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు ప్రతినిధుల సభ
నల్లగొండ జిల్లా కేంద్రంలో లక్ష్మీగార్డెన్స్‌లో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు రెండో రోజు కొనసాగాయి. ఇందులో భాగంగా ఆదివారం ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్తపై అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఫ విద్యకు తగిన బడ్జెట్ కేటాయించాలి
ఫ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
అలుగుబెల్లి నర్సిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment