నాగార్జునసాగర్: ఉమ్మడి నల్లగొండ జిల్లాపరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు బుధవారం, గురువారం నాగార్జునసాగర్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఐలయ్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడాపోటీల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఈ క్రీడల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. క్రీడాకారులు ఈ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment