శిలాఫలకం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్: మండలంలోని అయిటిపాముల గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. అయిటిపాముల గ్రామ రిజర్వాయర్ సమీపంలో శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయగా మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. రూ.101.62 కోట్లతో 10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మాజీ మంత్రులు తన్నీరు హరీష్‌రావు, గుంటకండ్ల జగదీష్‌రెడ్డితో కలిసి 2023 29 సెప్టెంబర్‌న శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కొత్త శిలాఫలకాన్ని నిర్మించాలని చెప్పారు. లేదంటే కలెక్టర్, ఈఎన్‌సీ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములుయాదవ్, బీఆర్‌ఎస్ నాయకులు పోగుల నర్సింహ, వడ్డె సైదిరెడ్డి, పెద్ది బాలనర్సింహ, నల్లమాద సైదులు, బెల్లి సుధాకర్, మంగదుడ్ల వెంకన్న, ఎడ్ల చిన్నరాములు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment