మునుగోడు నియోజక వర్గ ప్రజలకు ‘కంటి’కి రెప్పలా..
మునుగోడు: మునుగోడు నియోజకవర్గానికి చెందిన 90 మందికి స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హైదరాబాద్‌లోని శంకర హాస్పిటల్‌లో దగ్గరుండి కంటి ఆపరేషన్లు చేయించారు. మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలకు కంటి సమస్యలు ఉండొద్దనే ఉద్దేశంతో ఇటీవల మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తన తల్లి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 1060 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. అందులో 300 మందికి పైగా శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు తేల్చారు. మొదటి దఫాలో 90 మందిని ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌లోని శంకర హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్లు చేయించారు. తిరిగి వారందరినీ మంగళవారం బస్సులోనే ఇంటికి పంపించి మరో 90 మందిని ఆపరేషన్లు చేయించేందుకు తీసుకెళ్లారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి దగ్గరకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఫ 90 మందికి కంటి ఆపరేషన్లు
చేయించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment