మంత్రి గారూ... మీకు అర్థమవుతోందా!?
లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్సీ) కార్యాలయాలను కర్నూలు నుంచి అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి చట్టసవరణ చేస్తాం. ఆపై తరలింపు నోటిఫికేషన్ జారీ చేస్తాం. – ఈ నెల 13న హైకోర్టుకు
స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
‘లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ కర్నూలులోనే ఉంటాయి. ఇప్పటికే నెలకొల్పిన సంస్థలు తరలించబోం. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చించాం. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’
– ఈ నెల 15న మంత్రి టీజీ భరత్ ప్రకటన
పై రెండు ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే ‘న్యాయసంస్థల’ తరలింపుపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని తెలిసి కూడా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజలను మభ్యపెట్టేలా ప్రకటన చేశారు ఓవైపు లోకాయుక్త, హెచ్‌ఆర్సీని అమరావతికి తలించే నిర్ణయం తీసుకున్నామని ఏకంగా హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసిన తర్వాత కూడా మంత్రి భరత్ ఇలాంటి ప్రకటన చేయడం హాస్యాస్పదం! పైగా గత ప్రభుత్వం కర్నూలులో హైకోర్టుతో పాటు జ్యుడీషియల్ సిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటే, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అదేదో గొప్ప ఘనతలా మంత్రి చెప్పడం శోచనీయం. కళ్లేదుటే అన్యాయం జరుగుతున్నా ఎవరిలోనూ పోరాటం కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment