నంద్యాల(అర్బన్): బీసీ స్టడీ సెంటర్‌లో నిర్వహిస్తున్న డీఎస్సీ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమ అధికారి ముస్తాక్‌అహమ్మద్ అన్నారు. స్థానిక రామకృష్ణ విద్యాలయంలో శనివారం ఉచిత శిక్షణను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అభ్యర్థులు ప్రణాళికతో చదువుకుని ఉపాధ్యాయ పోస్టులు సాధించాలన్నారు. కార్యక్రమంలో అధికారులు ఓబులేసు, గోవర్ధనయ్య, ప్రిన్సిపాల్ మునిశేఖర్, నాగేంద్ర, సంక్షేమ అధికారులు మునిరాజ్, సువర్ణ, ముంతాజ్‌భేగం, సురేష్, వేణుగోపాల్, వెంకటపతి, గంగాధర్‌గౌడ్, వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
డీఎస్సీ –2024 ఉచిత శిక్షణ దరఖాస్తు గడువును ఈనెల 19 వరకు పొడిగించినట్లు నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ అధికారి ముస్తాక్ అహమ్మద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్షలోపు ఉండాలని, టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్‌లోని జిల్లా వెనుకబడిన తరగతులు, సాధికారత అధికారి కార్యాలయంలో లేదా సెల్: 9989003020, 8074461664 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment