‘పది’లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
నందికొట్కూరు: ఈసారి ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని బాలికల జెడ్పీ హైస్కూల్, సంతపేట స్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాడు–నేడు కింద చేపట్టిన ఉర్దూ పాఠశాల నిర్మాణాలను పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈఓ సుభాన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు తీసుకొని ప్రతి విద్యార్థి పాస్ అయ్యేలా చూడాలన్నారు. ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరగాలని, అందుకు అనుగుణంగా మండల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం మండల విద్యాశాఖ కార్యాలయంలో అపార్ నమోదు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు.
బాలికల జెడ్పీ హైస్కూల్‌లో
గుడ్డు మాయంపై విచారణ
బాలికల జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో కోడి గుడ్డు ఇవ్వడం లేదని విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనపై డీఈఓ స్పందించారు. ఎందుకు గుడ్డు ఇవ్వడం లేదని శనివారం హెచ్‌ఎం పార్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. అనంతరం పదో తరగతి గదిలో విద్యార్థులతో డీఈఓ ముచ్చటించారు. ఇష్టంతో చదువుకుంటే మంచి మార్కులు వస్తాయని చెప్పారు.
నందికొట్కూరులోని
ప్రభుత్వ పాఠశాలల తనిఖీలో డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment