ఓం నమో శివ రుద్రాయ
శ్రీశైలంటెంపుల్: శ్రీగిరి క్షేత్రం హర..హర..మహాదేవా అంటూ భక్తుల శివనామస్మరణతో మారుమోగింది. కార్తీకమాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజాము నుంచే మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నేత్రానందభరితంగా సాగింది. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈఓ ఎస్.ఎస్.చంద్రశేఖర ఆజాద్, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన శ్రీగిరి
నేత్రానందభరితంగా లక్షదీపోత్సవం,
పుష్కరిణి హారతి
Comments
Please login to add a commentAdd a comment