నంద్యాలలో..
● నంద్యాల పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
● బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇరుకై న అద్దె భవనంలో విద్యార్థులు వసతి పొందుతున్నారు.
● డిగ్రీ కళాశాల మైదానంలో ఉన్న ఎస్సీ బాలుర జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థుల వసతి గృహంలో శుభ్రత కానరావడం లేదు. ప్రహరీ గోడలు లేవు. బాత్‌రూములు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులు బహిర్భూమికి బయటకు వెళ్తున్నారు. ఎస్టీ జూనియర్ కళాశాల బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లకు తలుపులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడంతో ఎవరూ వీటిని ఉపయోగించడం లేదు. రైల్వేట్రాక్ పక్కకు బహిర్భూమికి వెళ్తున్నారు.
బనగానపల్లెలో :
● అవుకు కస్తూరిబాగాంధీ హాస్టల్‌లో ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో విద్యార్థినులు కడుపులు మాడ్చుకుంటున్నారు. విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ విద్యార్థినుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
● సంజామల కస్తూరిబాగాంధీ హాస్టల్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు, డైనింగ్ హాలు లేకపోవడంతో విద్యార్థినులు భోజనం చేసేందుకు సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు.
● బనగానపల్లె పట్టణంలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో మరుగుదొడ్లు, స్నానపు గదులు అధ్వానంగా ఉన్నాయి. ప్రహరీ లేకపోవడంతో విద్యార్థినులతో పాటు సిబ్బంది రాత్రి వేళల్లో హాస్టల్లో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
● కొలిమిగుండ్ల కస్తూరిబాగాంధీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్టుగా డైనింగ్ హాల్ లేక పోవడంతో భోజనం వరండాలో కూర్చోని తినాల్సి వస్తుంది. విద్యార్థినులకు సరిపడ్డ టాయిలెట్లు లేవు. రెగ్యులర్ ఎస్‌ఓ లేరు.
శ్రీశైలంలో..
ఈ నియోజవకర్గంలోని వివిధ వసతి గృహాల్లో విద్యాభ్యాసం నిర్వహిస్తున్న విద్యార్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. శ్రీశైలం మండలంలోని శ్రీశైలం, సున్నిపెంట వసతి గృహాలు నల్లమల అభయారణ్యంలో ఉన్నాయి. ఈ వసతి గృహాలకు సరైన ప్రహరీగోడలు లేకపోవడంతో చిరుతలు ఎప్పుడు దాడి చేస్తాయోనని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలు మార్లు వసతి గృహాలకు సమీపాల్లో చిరుతలు సంచరించాయి. అలాగే ఈ నియోజకవర్గంలోని వసతి గృహాలకు సీసీ కెమెరాలు లేవు. దీంతో బాలికల రక్షణ గాలిలో దీపంగా మారింది. ఇక వసతి గదులు, మరుగుదొడ్ల గురించి చెప్పనవసరం లేదు. ఆత్మకూరు, బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది మండలాల్లో వసతి గృహాలు శిథిలావస్థకు చేరాయి. పెచ్చులు ఊడి విద్యార్థులకు గాయాలు అయిన సంఘటనలూ ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గంలోని పలు సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇదే విధంగా ఉంది. వసతిగృహాల్లో ఆర్వో ప్లాంట్లు లేవు. గదులకు కిటికీలు లేవు. పిల్లలకు ప్లేట్లు, గ్లాసులు, దుప్పట్లు, ట్రంక్ పెట్టెలు ఇవ్వలేదు.
డోన్‌లో...
డోన్ నియోజకవర్గంలోని సంక్షేమ వసతి గృహాల్లో అరకొర సౌకర్యాలతో విద్యార్థినీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. డోన్‌లోని జ్యోతిరావుపూలే వసతి గృహానికి ప్రహరీగోడ, సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో తరచుగా ఇక్కడి నుంచి బాలికలు పారిపోతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మోడల్, కస్తూరిబా బీసీ గురుకుల పాఠశాలలో 30 శాతం అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలీ ఎస్సీ వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ మూత పడటంతో విద్యార్థులు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కుళాయి నీరు తాగుతూ తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.
● సంక్షేమ వసతి గృహాలను
పట్టించుకోని ప్రభుత్వం
● పెచ్చులూడి శిథిలావస్థకు చేరిన
పలు భవనాలు
● కానరాని శుభ్రత, ప్రహరీలు,
సీసీ కెమెరాలు
● గాలిలో దీపంగా మారిన
పేద పిల్లల భద్రత
● హైకోర్టు మొట్టికాయ వేసినా
స్పందన లేని సర్కారు
● తీవ్ర అవస్థలు పడుతున్న విద్యార్థులు
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మరుగుదొడ్లు మండలకేంద్రం దొర్నిపాడులోని ఎస్సీ బాలుర వసతి గృహంలోనివి. వీటికి తలుపులు, నీరు, విద్యుత్, వసతులు లేక నిరుపయోగంగా మారాయి. వాటిని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తల్లిదండ్రులు కోరుతున్నారు.అయితే, కూటమి సర్కారు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది. చిన్నపిల్లలపై కూడా లైంగిక దాడులు జరుగుతున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే పై చిత్రంలో కనిపిస్తున్న శిరివెళ్ల ఏపీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహం రక్షణ లేకుండా ఉంది. ఇది ప్రధాన రహదారికి సమీపంలో ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. వసతిగృహానికి ప్రహరీ లేదు. దీంతో బాలికలు ప్రతి రోజు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
62
భోజనాల్లో నాణ్యత పాటించని వసతిగృహాలు
67
మౌలిక వసతులు లేని హాస్టళ్లు
23,565 మొత్తం విద్యార్థుల సంఖ్య
137
జిల్లాలో మొత్తం హాస్టళ్లు
57 పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్న హాస్టళ్లు
Comments
Please login to add a commentAdd a comment