ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించండి
నంద్యాల: వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కచాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అ ర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాలవ్యవధిలో గా వాటికి పరిష్కారం చూపాలన్నారు. ఈవిషయంలో నిర్లక్ష్యం వహించరాదన్నారు.పీజీఆర్‌ఎస్‌లో 183 దర ఖాస్తులొచ్చాయని, వీటిని పరిష్కరించాలన్నారు.
ఎఫ్‌ఆర్‌బీఏ ఆధారంగానే జీతభత్యాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులకు ఫేస్ రికగ్నేషన్ బేస్డ్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌బీఏ) ఆధారంగానే జీతాల చెల్లింపు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ, ఎంపీడీఓలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులు వివిధ అంశాల్లో పనితీరు మెరుగుపరుచుకుని నిర్దేశించిన లక్ష్య సాధనపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో హౌస్ హోల్డ్ ఇమేజ్ జియో ట్యాగింగ్ సర్వే 35 శాతం పెండింగ్‌లో ఉందని తక్షణమే పూర్తి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అపార్ ఐడీ జనరేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. మండల స్థాయిలో సిబ్బంది పనితీరు సరిగ్గా లేదని, జిల్లా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం
పీజీఆర్‌ఎస్‌కు 183 వినతులు
Comments
Please login to add a commentAdd a comment