ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

Published Tue, Nov 19 2024 2:05 AM | Last Updated on Tue, Nov 19 2024 2:05 AM

ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం

● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుభాష్‌ చంద్రబోస్‌

కర్నూలు (టౌన్‌): అఽధికారం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌ విమర్శించారు. సోమవారం సి.క్యాంపులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. తన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి జగనన్నకు, రాష్ట్ర నాయకత్వానికి, కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున నిరంతరం పోరాటం చేస్తానన్నారు. గత ప్రభుత్వం కన్నా మెరుగైన పథకాలు అందిస్తామని, ఇంటింటికి ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు అందిస్తామని పదే పదే చెప్పిన కూటమి నేతలు ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలైనా సూపర్‌ సిక్స్‌ను అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. అన్ని రంగాల్లో విఫలం చెందిన కూటమి ప్రభుత్వాన్ని సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న వైస్సార్‌సీపీ సానుభూతి పరులను వేధించడం మానుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement