నిప్పుల వాగులో బాలిక గల్లంతు
వెలుగోడు: నిప్పుల వాగులో పదేళ్ల బాలిక గల్లంతైంది. వివరాలు.. మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన సుంకరి హరినాథ్‌బాబు భార్యతో పాటు కుమార్తె భవ్యశ్రీ, కుమారుడు బాలీశ్వర్తో కలసి భార్య పుట్టినిల్లైన అయ్యవారిపల్లె గ్రామానికి చేరుకున్నారు. కార్తీక నోములను పురస్కరించుకొని నిప్పులవాగులో స్నానం ఆచరించేందుకు తాత రామచంద్రుడు భవ్యశ్రీ, బాలీశ్వర్లను తీసుకొనివెళ్లాడు. స్నానం ఆచరించే సమయంలో నీటి ఉద్ధృతి పెరిగి ఇద్దరు కొట్టుకొని పోగా బాలీశ్వర్ను ఒడ్డుకు చేర్చాడు. ఎంత వెతికినా భవ్యశ్రీ ఆచూకీ కనపడలేదు. కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment