రైలు నుంచి జారి పడి వృద్ధురాలి మృతి
కర్నూలు (టౌన్): రైలు నుంచి జారి పడి ఓ వృద్ధురాలు మృతి చెందింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. కర్నూలు సిటీ –దూపాడు మధ్య ఓ వృద్ధురాలు రైలు నుంచి జారి పడి అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడ ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో స్టేషన్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహానందీశ్వరుడి
సన్నిధిలో తానా అధ్యక్షుడు
మహానంది: కార్తీక మాసం పురస్కరించుకుని తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఆయన సోద రులు సోమవారం మహా నందీశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆల య ఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రాంగణంలోని అభివృద్ధి పనులుపై చర్చించారు. నవదుర్గలు, నవ వినాయకుల వద్ద గ్రానైట్ ఫ్లోరింగ్ ఏర్పాటుకు ఆర్థిక సా యం అందజేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయనను ఈఓ, వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరిరవిశంకర అవధాని సన్మానించారు. కాగా నూతనంగా ప్రవేశపెట్టిన గంగా హారతి కార్యక్రమానికి అవసరమైన 10 రకాల హారతులతో కూడిన ఐదు సెట్లను హైదరాబాద్, సికింద్రాబాద్, కర్నూలు నగరాలకు చెందిన దొంతు నరేష్, చైతన్య, శ్రీనివాస్, మాలతి, గోవర్థన్‌రెడ్డి, మీనాకుమారి, రోశిరెడ్డి, పరిమళ, కేవీ రమణాచారి, సునీత అందించారని ఈఓ తెలిపారు.
కర్నూలులో
హాస్య ‘బ్రహ్మ’ సందడి
కర్నూలు కల్చరల్: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం కర్నూలులో సందడి చేశారు. సోమవారం బిర్లా కాంపౌండ్‌లో ఓ టీస్టాల్‌ను రాజ్య సభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్‌తో కలిసి బ్రహ్మానందం ప్రారంభించారు. బ్రహ్మానందాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. బ్రహ్మీ అభివాదం చేయడంతో అభిమానులు కేరింతలు కొట్టారు. కర్నూలు ప్రజలు మంచి వాళ్లని, మంచి సినిమాలను ఎప్పటికై నా ఆదరిస్తారని బ్రహ్మానందం అన్నారు. అనంతరం టీజీ వెంకటేష్ నివాసానికి వెళ్లారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
కర్నూలు (టౌన్): మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతూ ఐదుగురు పట్టుబడ్డారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఐదుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. రూ.1.30 లక్షల నగదు, పేక ముక్కలు, పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు సోమవారం మూడో పట్టణ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment