చూసిన కనులదే భాగ్యం
ఆళ్లగడ్డ: లక్ష్మీనరసింహ నామస్మరణతో అహోబిలం మార్మోగింది. ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో వేంచేసిన వనభోజన మహోత్సవం కనుల పండువగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పరవశించిపోయారు. కార్తీక మాసం మూడో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీనృసింహస్వామి వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఏటా కార్తీకమాసంలో స్వామి, అమ్మవార్లను వనభోజన కార్యక్రమానికి తీసుకెళ్లి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు వేకువజామునే సుప్రభాతసేవతో మేలుకొలిపి దివ్యదర్శనం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఉత్సవ మూర్తులైన స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవ పల్లకీలో కొలువుంచి గ్రామ శివారులోని లక్ష్మీ వనంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశ స్థాపన, పంచామృతాభిషేకం, తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరిచిన మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుంచాక భక్తులు వనభోజనం చేశారు. తర్వాత స్వామి, అమ్మవారిని ఊరేగింపుగా దేవాలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. రాత్రి విశేష పుష్కాలంకరణ గావించిన పూల పల్లకీలో ఉత్సవ మూర్తులను కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నర్విహించారు.
వైభవంగా లక్ష్మీనృసింహుల
వనభోజన మహోత్సవం
గోవింద నామస్మరణతో మార్మోగిన
అహోబిల క్షేత్రం
Comments
Please login to add a commentAdd a comment