సంక్రాంతి అంటే పల్లెల్లో ఎంతో హడావుడి ఉంటుంది. జనవరి నె
సంక్రాంతి పండుగ సమయానికి ఇంటికి ధాన్యం వచ్చేది. ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో సరిగా పంట చేతికి రాలేదు. గత ఏడాది వరి పంట ఎకరాకు 30 నుంచి 35బస్తాలు దిగుబడి రాగా బస్తా బియ్యం రూ.3 వేలు పలికేది. ఈ ఏడాది ఎకరాకు దిగుబడి తగ్గడమే కాకుండా బస్తా బియ్యం రూ.2 వేలు కూడా పలకకపోవడంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. కంది, మొక్కజొన్న, మినుము, సోయాబిన్ తదితర పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి కూడా ఇదే.
వంట నూనెలపై పెరిగిన ధరలు...
2024 జూన్ వరకు పామాయిల్, పొద్దుతిరుగుడు నూనెల ధరలు లీటరు రూ.100 వరకే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముడి సరుకు దిగుమతిపై భారీగా పన్నులు పెంచడంతో వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్‌ఫెడ్‌తో పాటు ప్రైవేటు ఆయిల్ కంపెనీలు ధరలను అడ్డుగోలుగా పెంచేశాయి. ప్రస్తుతం లీటర్ పామాయిల్ ధర రూ.140, పొద్దుతిరుగుడు నూనె ధర రూ.150 వరకు ఉంటోంది. లీటర్‌పై 50 శాతం వరకు ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం పెరిగింది.
● ఈ సారి రైతుకు కలిసి రాని
వ్యవసాయం
● పంటలు పండక, పండిన వాటికి
గిట్టుబాటు ధర లేక అవస్థలు
● ఎప్పుడూ లేనివిధంగా పెరిగిన
నిత్యావసర వస్తువుల ధరలు
● గత సర్కారుకు,
నేటి ప్రభుత్వానికి ఎంతో తేడా
● అమలు కాని సూపర్–6 హామీలు
● అధ్వానంగా సామాన్య,
మధ్య తరగతి ప్రజల జీవనం
● కొనుగోలు సామర్థ్యం లేక
సంక్రాంతి వెలవెల
నంద్యాల: సంక్రాంతి అంటే రైతుల పండుగ అంటారు. ఈసమయంలో అన్ని రకాల పంటలు చేతికి వస్తాయి కనుక గ్రామాలు కళకళలాడుతాయి. అయితే నేడు జిల్లాలో ఎటూ చూసినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. అధిక వర్షాలు, వర్షాభావంతో పంట దిగుబడులు పడిపోయాయి. వాటికి మార్కెట్‌లో ధరలు లేకపోవడంతో పెట్టుబడులు కూడా రావడం లేదు. జిల్లాలో 3.5 లక్షలకు పైగా మంది రైతులు ఉండగా, వీరిలో 80 శాతం మంది కష్టాల్లో కూరుకుపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు పూర్తవుతున్నా రైతులకు, ఇతర వర్గాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు. ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా రైతులకు ఏడాది రూ.20 పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించారు. తల్లికి వందనం పేరుతో ఊరించారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి 15 వేలు చెల్లిస్తామని నమ్మించారు. పొదుపు మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 చెల్లిస్తామంటూ ఆశ పెట్టారు. అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. నేడు వాటి గురించి పట్టించుకునే దాఖలాలే లేవు.
వరి రైతు పరిస్థితి ధైన్యం
వైఎస్ జగన్ పాలనలో ఇలా..
2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సారథ్యంలోని సర్కారు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేసింది. 2019 మే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే చెప్పిన మాట ప్రకారం హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్లు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వైఎస్సార్ రైతుభరోసా, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ నేతన్న నేస్తం, విద్యాదీవెన, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం.. ఇలా అనేక పథకాలు అమలయ్యాయి. ఒక్కో కుటుంబానికి సగటున ఏడాదికి రూ.75 వేల నుంచి లక్ష వరకు నగదు ప్రయోజనం లభించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాదికి రూ.3,500 కోట్ల వరకు నగదు నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేది. రైతులు పండించిన పంటలకు ధరలు లేనప్పుడు ఆర్‌బీకేల వారీగా కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరలతో కొనుగోలు చేసింది. అప్పట్లో ప్రజల్లో కొనుగోలు సామర్థ్యం కూడా గణనీయంగా పెరిగింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో
సంక్షేమ పథకాల అమలు ఇలా ..
జనవరి: చివరి దఫా రైతు భరోసా, చిరు వ్యాపారులకు జగనన్న తోడు, సంక్రాంతి సమయానికి అక్క చెల్లెమ్మలకు ఆసరా డబ్బులు
ఫిబ్రవరి: విద్యా దీవెన, జగనన్న చేదోడు
ఏప్రిల్: వసతి దీవెన, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ
మే: జగనన్న విద్యా దీవెన, రైతులకు ఉచిత
పంటల బీమా, రైతు భరోసా,
మత్స్యకారులకు మత్స్యకార భరోసా,
డీజిల్ మీద సబ్సిడీ కార్యక్రమం
జూన్: అమ్మ ఒడి
జూలై: వాహనమిత్ర, కాపునేస్తం,
చిరువ్యాపారులకు జగనన్న తోడు
ఆగస్టు: జగనన్న విద్యాదీవెన, నేతన్న నేస్తం
సెప్టెంబర్: వైఎస్సార్ చేయూత
అక్టోబర్: వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత
నవంబర్: జగనన్న విద్యాదీవెన,
రైతులకు సున్నా వడ్డీ డబ్బులు
డిసెంబర్: ఈబీసీ నేస్తం, లా నేస్తం,
8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు
ప్రస్తుత పరిస్థితి ఇదీ..
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించింది. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల ఊసే లేకపోవడంతో ప్రజల్లో కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోయింది. వంట నూనెలు, కంది పప్పు, మినపప్పు తదితర నిత్యావసర వస్తువుల ధరలు 40 నుంచి 50 శాతం వరకు పెరిగాయి. లీటరు పామాయిల్ ప్యాకెట్ ధర రూ.150 వరకు ఉందంటే ప్రస్తుతం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం అవుతోంది. 2023–24 రబీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాలో 12 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్ 19, 20 తేదీల్లో సెంట్రల్ టీమ్ పర్యటించి రూ.37.76 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్ కింద కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇచ్చినప్పటికీ రాష్ట్రం మాత్రం కరువు రైతులను విస్మరించింది. 2023 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లించకుండా కూటమి ప్రభుత్వం అవరోధాలు కల్పించింది. పండించిన పంటలకు గిట్టుబాటు కాదు గదా.. కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో 20 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.
బంగారం వ్యాపారం పడిపోయింది
2020 నుంచి 2023 వరకు బంగారు వ్యాపారం
సంతృప్తికరంగా ఉండేది. సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో నగదు పరపతి పెరిగింది. సాధారణ, మధ్య తరగతి ప్రజలు చిన్నచిన్న బంగారం వస్తువులను కొనుగోలు చేసేవారు. ఇప్పుడు బంగారం వ్యాపారం పడిపోయింది. – పుణ్యమూర్తి రామయ్య, మాజీ అధ్యక్షుడు, కర్నూలు జ్యువెలరీ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment