పంట దిగుబడి లేదు..
ఈ ఏడాది వరి పంట నాలుగు ఎకరాల్లో సాగు చేశాను. దిగుబడి భారీగా తగ్గిపోయింది. గిట్టుబాటు ధర కూడా లేదు. గత ఏడాది సంక్రాంతి పండుగ సమయానికి ఇంటి నిండా ధాన్యం ఉండేది. గతేడాది వరి బస్తా రూ.3 వేలకు పైగా పలకగా ఈ ఏడాది రూ.2 వేలు కూడా పలక లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. రైతు భరోసా లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సంక్రాంతి పండుగకు పిల్లలకు కొత్త బట్టలు కూడా తీసుకోలేదు.
– దూదేకుల కాశీం, రైతు, కానాల, నంద్యాల
Comments
Please login to add a commentAdd a comment