మహాశివరాత్రి ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: ఈ నెల 19 నుంచి జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాలు, క్యూలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లడ్డూ కౌంటర్ వద్ద ప్రస్తుతం ఉన్న 15 కేంద్రాలతో పాటు అదనంగా మరో 8కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేకంగా క్యూలైన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రసాదాల విక్రయ కేంద్రాల వద్ద తగినన్ని సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శుచీ, శుభ్రత పాటిస్తూ నాణ్యతతో లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని ఆదేశించారు. క్యూలలో తొక్కిసలాట జరగకుండా సెక్యూరిటీ, శివసేవకులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదనంగా రెండు కొబ్బరికాయ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు మురళీబాలకృష్ణ, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment