రాష్ట్రంలో సాగుతున్న రెడ్‌బుక్ పాలనకు గుణపాఠం తప్పదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పాలన చూడలేదన్నారు. అమాయకుల పంటలు, ఇళ్లను ధ్వంసం చేసిన ఘనత టీడీపీ నాయకులకే దక్కుతుందన్నారు. కూటమి నాయకుల ఆగడాలపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే తమ పార్టీ కార్యకర్త పంటకు నిప్పుపెట్టారన్నారు. పోలీసు వ్యవస్థ వారి దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజే ంద్రనాఽథ్‌రెడ్డి, నందికొట్కూరు ఇన్‌చార్జ్ దార సుధీర్, నేతలు భూమా కిషోర్‌రెడ్డి, శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, డాక్టర్ శశికళరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, పీపీ మధుసుదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment