ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
మాగనూర్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామని, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు సంబంధించి రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని డీఏఓ జాన్‌సుధాకర్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు పెస్టిసైడ్స్ బాటిళ్లను పరిశీలించి ఎకై ్స్పరీ అయిపోయిన వాటిని రైతులకు ఇవ్వొదని ఫర్టిలైజర్ షాపుల యజమానులకు ఆదేశించారు. ముఖ్యంగా స్టాక్ రిజిస్టార్‌లో చూపిన విధంగానే ఉండాలని, తనిఖీల సమయంలో తేడా వస్తే చర్యలు ఉంటాయని అన్నారు. అనుమతి లేని మందులను విక్రయిస్తున్నట్లు తెలిస్తే షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment