ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవిస్తూ 15 అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామచందర్,ఏఓ జయసుధ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పి. బెన్ షాలం సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ సిక్తాపట్నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment