స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకం
నారాయణపేట రూరల్: ఇటీవల నిర్వహించిన డీఎస్సీ 2024లో ఎంపికై న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు నియామక ఉత్తర్వులు, విధుల కేటాయింపును చేపట్టారు. జెడ్పీ సీఈవో మొగలప్ప, డీఈవో ఎం.డి అబ్దుల్ ఘని ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 12మంది టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వారికి కేటాయించిన చోట్లలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి తదితరులు వారికి శుభాకాంక్షలు తెలియజేసి వృత్తిపరంగా అవసరమయ్యే అప్లికేషన్స్‌తో కూడిన ఫైళ్లను అందజేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల అభ్యున్నతిలో టీచర్లు కీలక పాత్ర పోషిస్తారని, వైకల్యం ఉన్న విద్యార్థుల అభ్యాసన అడ్డంకులను అధిగమించడానికి వారి సేవలు ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో సీఎంఓ రాజేంద్రకుమార్, ఎస్ ఓ శ్రీనివాస్, యాదయ్య శెట్టి, సంఘ నాయకులు రఘువీర్, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
సమగ్ర సర్వే పకడ్బందీగా చేపట్టాలి
మరికల్: మండలంలో నిర్వహించే కుటుంబ సమగ్ర సర్వేను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని డీపీఓ కృష్ణ అన్నారు. మరికల్ రైతు వేదికలో సోమవారం సర్వే నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 10,489 కుటుంబలను గుర్తించడం జరిగిందని, ఇందుకుగాను 87 మంది అధికారులను నియమించామన్నారు. ఇంటింటికి వెళ్లి వారి నుంచి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాలని తెలిపారు. ఒక కుటుంబంలో నిరక్షరాసులు, అక్షరాసులు, ఉద్యోగులు, రాజకీయాల్లో ఉన్నవారు, వ్యాపారులు ఉంటే సర్వే నివేదికలో నమోదు చేసుకోవాలని సూచించారు. సర్వే చేసిన ఇంటికి స్టిక్కర్ వేయాలన్నారు. ఎంపీడీఓ కొండన్న, ఎంపీఓ పావని, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జోగిని వ్యవస్థను రూపుమాపాలి
మరికల్: సమజంలో జోగిని వ్యవస్థను రూపు మాపాడం కోసం అధికారులు, పాలకులు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైన ఉందని జోగిని నిర్మూలన పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ హాజమ్మ అన్నారు. మరికల్‌లో సోమవా రం ఎస్సీ కమ్యూనిటీ భవనంలో ఓఎంఐఎఫ్ పౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేసి టైలరింగ్ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో జోగిని వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహలు, మూఢనమ్మకాలు, ఆరోగ్య సమస్యలు, మహిళల హింసలను రూపు మాసడం కోసమే తమ సంస్థ పోరాటం సాగిస్తుందన్నారు. ఎన్నో బాల్య వివాహలను అడ్డుకొని వారి జీవితాలకు మంచి మార్గం చూపించామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. మహిళల శక్తి వంతులుగా మారడం కోసమే తమ సంస్థ పని చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కొండన్న, ఎంపీఓ పావని, రామస్వామి, నర్సిములు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్..
మక్తల్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని.. కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఒకే బాటలో వెళ్తూ అధికారం కోసం హామీలు ఇస్తూ అధికారం రాగానే వాటిని మరిచిపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాన్‌వెస్లీ ఆరోపించారు. సీపీఎం రెండో మహాసభలు సోమవారం రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీ చేయలేదని, ఆరు గ్యారంటీలు అమలులో విఫలమైందని, కేవలం కుర్చీల కోసం కొట్లాడుతున్నారని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం రూ.లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు ఏ మాత్రం తగ్గించడం లేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు టీ.సాగర్, భరత్, అరుణకుమార్, గోపాల్, బాల్‌రాం గోవిందురాజు, ఆంజనేయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment