నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ డిజిటల్ సర్వేకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ దిశానిర్ధేశంతో జిల్లా అధికారయంత్రాంగం సిద్ధమైంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మూడు గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి గురువారం నుంచి డిజిటల్ సర్వే చేపట్టనున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో 15వ వార్డు, మక్తల్ మున్సిపాలిటీలో 13వ వార్డును సర్వేకు ఎంపిక చేశారు. అలాగే, నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండలంలోని అయ్యవారిపల్లి, మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలంలోని కొత్తపల్లి, కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం ముక్తిపాడ్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో గురువారం నుంచి డిజిటల్ సర్వే చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment