ఆస్పత్రులు, నర్సింగ్‌హోంలు, క్లినిక్‌లు, డిస్పెన్సరీలతో పాటు పశువైద్య సంస్థలు, బ్లడ్‌బ్యాంకులు, ఆయుష్ ఆస్పత్రులు, పరిశోధన విద్యాసంస్థలు, ఆరోగ్య శిబిరాలు, ఆపరేషన్ థియేటర్ల నుంచి బయో మెడికల్ వ్యర్థాలు వెలువడుతాయి. వీటిని నాలుగు రకాలుగా విభజించి నిల్వ చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. రెడ్, ఎల్లో, వైట్, బ్లాక్ బ్యాగులను కేటాయించి వీటిల్లో విడివిడిగా బయోమెడికల్ వ్యర్థాలను సేకరించాల్సి ఉంటుంది. సిరంజీలు, సాయిల్డ్, గ్లౌస్‌లు, కాథెటర్స్, ఐవీ ట్యూబులను రెడ్ కలర్ బ్యాగ్‌లో వేయాలి. బాడీ ఫ్లుయిడ్స్, బ్లడ్‌బ్యాగులు, మానవ శరీర వ్యర్థాలు, శరీర భాగాలతో కూడిన డ్రెస్సింగ్ పట్టీలను ఎల్లో బ్యాగులో వేయాల్సి ఉంటుంది. సూదులు, షార్ప్‌లు, బ్లేడ్‌లను వైట్ పంక్చర్ ప్రూఫ్ కంటైనర్(పీపీసీ) బ్యాగులో వేయాలి. బయోమెడికల్ కాని వ్యర్థాలను బ్లాక్ కలర్ బ్యాగులో వేయాల్సి ఉంటుంది. ఆస్పత్రులు ఈ నిబంధనలను అమలుచేయాల్సి ఉండగా చాలా వరకు పాటించడం లేదు. ఫలితంగా బయోమెడికల్ వ్యర్థాలు సాధారణ వ్యర్థాల్లో కలిసిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment