ఆస్పత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాలను సంబంధిత ఇన్సినరేటరీలు సేకరించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కన్పిస్తోంది. ప్రమాదకరమైన బయోమెడికల్ వేస్టేజ్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డులకు చేరుతోంది. ఈ వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది ఎట్టిపరిస్థితుల్లో సేకరించవద్దని కఠిన చట్టాలు, నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు వీటిపై సిబ్బందికి సరైన అవగాహన లేదు. మున్సిపల్ సిబ్బంది బయోమెడికల్ వ్యర్థాలను సేకరించడం, వాహనాల్లో తరలించడం, డంపింగ్ యార్డులో నిల్వ చేస్తుండటంతో సిబ్బందితో పాటు సమీప ప్రాంత ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. బయోమెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి ఇన్సినరేటరీలకు అప్పగించాలి కానీ ఇతర వ్యర్థాలతో కలపవద్దన్న నిబంధనలను ఆస్పత్రులు పాటించడం లేదు. ఫలితంగా హానికరమైన బయోమెడికల్ వ్యర్థా లు జనారోగ్యానికి, జంతువులకు ప్ర మాదకరంగా పరిణమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment