ధ్రువపత్రాల పరిశీలన షురూ..
● మొదటి రోజు 88 మంది
ఎస్జీటీ అభ్యర్థులు హాజరు
● మొత్తం ఆరు కౌంటర్లు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు
● డీఎస్సీ అభ్యర్థుల సందేహాలు
నివృత్తి చేసిన డీఈఓ
● నేటి నుంచి స్కూల్ అసిస్టెంట్లు, పండిత్, పీఈటీ అభ్యర్థుల వంతు..
నారాయణపేట రూరల్: డీఎస్సీ 2024లో ఎంపికై న అభ్యర్థుల జాబితా అర్థరాత్రి తర్వాత జిల్లాకు చేరుకోవడంతో బుధవారం 1ః3 నిష్పత్తిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అయితే కేవలం ఎస్జీటీ అభ్యర్థుల జాబితా మాత్రమే రావడంతో వారు మాత్రమే హాజరయ్యారు. స్థానిక ఎస్సీ బాయ్స్ హాస్టల్ కేంద్రంలో జరిగిన ధ్రువపత్రాల పరిశీలనకు జిల్లాలో ఎంపికై న మొత్తం 279మందికి గాను మొదటిరోజు 88మంది వారికి సంబందించిన సర్టిఫికేట్లు తీసుకుని వచ్చి వెరిఫికేషన్ చేయించుకున్నారు. అయితే సెల్‌ఫోన్‌కు మెసెజ్‌లు రావడంతో కొందరు స్కూల్ అసిస్టెంట్లు, పండిత్, పీఈటీ అభ్యర్థులు సైతం వచ్చి వెనుదిరిగారు. మరి కొందరు సీనియార్టీ జాబితాలో తమ పేరు ఉన్నా రోస్టర్ ప్రకారం ఉద్యోగం వస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో సీనియర్ టీచర్లతో చర్చలు చేయడం కనిపించింది. వాస్తవానికి అమవాస్య కావడంతో ఎస్‌జీటీ అభ్యర్థులు తక్కువ సంఖ్యలో హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తంగా 5 కౌంటర్లు తెలుగు మీడియం వారికి, మరో కౌంటర్ ఊర్దూ, మరాఠీ, కన్నడ మీడియం వారి కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అభ్యంతరాలు, సూచనలకై డీఈఓ కార్యాలయ అధికారులు నియమించారు. ఈ నెల 5వరకు ఈ పరిశీలన కార్యక్రమం కొనసాగుతుందని, గురువారం నుంచి స్కూల్ అసిస్టెంట్లు, పండిత్, పీఈటీలకు సంబందించిన అభ్యర్థులు రావాల్సి వస్తుందన్నారు. డీఈఓ ఎండీ అబ్దుల్ ఘని తనిఖీ చేసి ప్రక్రియ సజావుగా జరిగేందుకు తగిన చర్యలు చేపట్టారు. అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment