కొత్తపల్లిని సమగ్రాభివృద్ధి చేస్తాం
మద్దూరు: కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మండల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని కాడా అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తపల్లి, నిడ్జింత, భూనీడ్, దుప్పడిగట్, గోకుల్‌నగర్, నందిగామ, తిమ్మారెడ్డిపల్లి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని తెలిపారు. కొత్తపల్లిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకుగాను ప్రభుత్వ స్థలంలో రూ.8.50 కోట్లతో సమీకృత భవన నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. అలాగే భూనీడ్ ఉన్నత పాఠశాలకు 5 అదనపు తరగతి గదులు మంజూరు చేయాలని మాజీ పీఏసీఎస్ చైర్మన్ మహేందర్‌రెడ్డి కోరగా అంగీకరించారు. అలాగే నిడ్జింతలో అన్ని హంగులతో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దుప్పడిగట్‌లో ఆంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణానికి రూ.10 లక్షలు దేవాదాయశాఖకు చెల్లించినా.. ఇప్పటి వరకు మంజూరు కాలేదని విన్నవించగా.. ఆ శాఖ కమిషనర్‌కు ఫోన్ చేసి వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు రమేష్‌రెడ్డి, వెంకట్, విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, చెన్నప్ప, రఘు తదితరులు ఉన్నారు.
కాడా అధికారి వెంకట్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment