మత్స్యకారులుఆర్థికాభివృద్ధి సాధించాలి
మరికల్: ప్రభుత్వం రాయితీపై అందించే చేప పిల్లలతో మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రహమాన్ కోరారు. మంగళవారం మరికల్, తీలేర్ పెద్దచెరువుల్లో ఆయన చేప పిల్లలను వదిలి మాట్లాడారు. ఒక్కో చెరువులో 40 వేల చేప పిల్లలను వదిలామని.. వర్షాల కారణంగా ఆలస్యమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సూర్యమోహన్‌రెడ్డి, బసంత్, నారాయణ, వీరన్న, కొండయ్య, నర్సింహులు, ఆంజనేయులు, రామకృష్ణ, హరీశ్, రఘు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాంప్రదాయ
కళలు నేర్చుకోవాలి
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ప్రభుత్వం కళాఉత్సవ్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని అన్నారు. మంగళవారం బాలకేంద్రంలో పాఠశాలల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వివిధ కళా అంశాల్లో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయానికి పట్టుగొమ్మలు కళలని.. విద్యార్థులు సమయం వృథా చేయకుండా చదువుతో పాటు సాంప్రదాయ కళలు నేర్చుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని కోరారు. కార్యక్రమంలో జీసీడీఓ పద్మనళిని, సీఎంఓ రాజేందర్కుమార్, ప్లానింగ్ అధికారి నాగార్జున్రెడ్డి, యాదయ్య శెట్టి, బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్రెడ్డి, సంగ నర్సింహులు, వసంత్, జ్ఞానామృత, లక్ష్మణ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చదువుతో పాటుక్రీడల్లో రాణించాలి
నారాయణపేట రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి నర్సింహులు కోరారు. మంగళవారం మండలంలోని కోటకొండ జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ కబడ్డీ అండర్–17 క్రీడాపోటీలు నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యంతో పాటు స్నేహభావం, పోటీతత్వం పెరుగుతాయని తెలిపారు. పోటీల్లో గెలుపోటములను సమాంతరంగా తీసుకోవాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు. అనంతరం టాస్ ఎగురవేసి పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం డా. సునీత, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రమణ, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు రాము, కెంచె శ్రీనివాస్, నాయకులు రాజు, బాలప్ప, కుర్మేశ్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment