ధరలు చూస్తే భయమేస్తుంది..
●
మధ్య తరగతి, సామాన్య ప్రజలు టపాసులు కొనలేని పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ధర లు పెరుగుతూనే ఉన్నా యి. ఆ ధరలను చూస్తే భయం వేస్తుంది. గతంలో రూ.వందల్లో పెట్టి కొంటే వచ్చే టపాసులు ఇప్పుడు రూ.వేలు పెట్టి కొన్నా రావడం లేదు. టపాసుల ధరలు సామాన్యులకు అందుబాటు లో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– మంజుల, గృహిణి, మహబూబ్‌నగర్
పండగ భారంగా మారింది..
నిత్యావసరాలతోపాటు టపాసుల ధరలు విపరీతంగా పెరగడంతో దీపావళి పండగ భారంగా మారింది. పిల్లల సంతోషం కోసం టపాసులు కొనుగోలు చేయక తప్పడం లేదు. మార్కెట్‌లో ధరల నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
– మమత, కొత్తూరు గ్రామం, మిడ్జిల్
కొన్ని మాత్రమే కొన్నాం..
గతేడాది కంటే ఈసారి పటాకులకు అధిక ధర లు చెప్తున్నారు. ఇంతకు ముందు రూ.వెయ్యికే 15 నుంచి 20 రకాల పటాకులు కొనుగోలు చేసేవాళ్లం. ఇప్పుడు 10 రకాల బాణాసంచా కూడా వచ్చే పరిస్థితి లేదు. అధిక ధరల కార ణంగా కొన్ని పటాకులనే కొనుగోలు చేశాం.
– సి.భారతి, గోపన్‌పల్లి, దేవరకద్ర
సామాన్యులు కొనలేరు..
గతేడాదితో పోల్చితే ఈ సారి ఏకంగా 20 శాతం ఎక్కువ ఉన్నాయి. పిల్ల ల సంతోషం కోసం త ప్పనిసరికొనాల్సి వస్తుంది. రూ.వెయ్యితో కొందామనుకుంటే ఏకంగా రూ.2 వేలకుపైగా బిల్లు అవుతుంది. – శాంతకుమార్, వీరన్నపేట
Comments
Please login to add a commentAdd a comment