జడ్చర్ల టౌన్: చట్టాలు, హక్కులు కాపాడుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సీపీఎం 20వ జిల్లా మహాసభల సందర్భంగా జడ్చర్లలోని అంబేద్కర్ కళాభవన్‌లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ ప్రతి మూడేళ్లకోమారు జిల్లాస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని, జైలుకు పంపిస్తున్నారని, దుర్మార్గపు పాలన సాగిస్తూ సంపద కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేయాల్సిందేనని, అది ఎర్రజెండాకు మాత్రమే సాధ్యమన్నారు. ఈ విషయంపై మహాసభల్లో విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment