రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
నారాయణపేట/మరికల్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో 366మంది, మరికల్‌లో 85 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నారాయణపేట మండలం లింగంపల్లి వద్ద ఉన్న భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. మరికల్‌లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తల్లిదండ్రులు ఆడబిడ్డను భారంగా భావించవద్దని.. ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వేపై ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తమన్నారు. సర్వేపై ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. కార్యక్రమాల్లో ఆర్డీఓ రాంచందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, వైస్ చైర్మన్ కోణంగేరి హన్మంతు, మున్సిపల్ చైర్‌పర్సన్ అనసూయ, వైస్‌చైర్మన్ హరినారాయణ భట్టడ్, కౌన్సిలర్లు ఎండీ సలీం, బండి రాజేశ్వరి, మహేష్, నాయకులు నరహరి, సూర్యమోహన్‌రెడ్డి, వీరన్న, హరీష్, రామకృష్ణారెడ్డి, కృష్ణయ్య, శ్రీకాంత్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment