నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట: జిల్లా పరిధిలో నిత్యం శాంతి భద్రతలు పరిరక్షిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రాపర్టీ నేరాల నియంత్రణపై దృష్టి సారించి అట్టి కేసులలో సరైన సాక్ష్యాధారాలను సేకరించి సాంకేతికతను జోడించి త్వరగా కేసులను చేధించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గురువారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల పై అధికారులను అడిగి తెలుసుకొని న్యాయ అధికారాలతో సమన్వయం చేసుకుంటూ కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో పని చేసి జిల్లాకు మంచి పేరు తేవాలన్నారు. ప్రాపర్టీ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నేరాలు జరిగిన వెంటనే తగిన సాక్షాధారాలు సేకరించి సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను త్వరగా చేదించాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ, పూర్తి పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు.
సైబర్ నేరాల నియంత్రణపై..
సైబర్ నేరాల నియంత్రణపై సిసి కెమెరాల ఆవశ్యకతను గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, హైవే, నేషనల్ హైవేల పై సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, జిల్లా పరిధిలో నిత్యం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి ఆకస్మిక వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సామాజిక అంశాలపై లోకల్ పోలీసులు, షీ టీమ్స్, పోలీస్ కళాబృందం వారు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎన్ లింగయ్య, సిఐలు శివ శంకర్, దస్రునాయక్, రామ్‌లాల్, చంద్రశేఖర్, రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, రాజు, కుర్మయ్య, రమేష్, నవీద్, మురళీ, బాగ్య లక్షీర్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment